ఉద్యోగ ప్రకటన

గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు, గుంటూరు జిల్లా

ఉద్యోగ ప్రకటన (బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి)

గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు నందు ఖాళీగా ఉన్న ఈ క్రింది పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

పోస్టు- స్వీపరు (ఎస్టి కులమునకు) Sweeper (ST) ఖాళీలు -1

పోస్టు- థొటి(ఎస్సి కులమునకు మహిళ)Thoti (SC-w) ఖాళీలు -1

పోస్టు- థొటి(ఎస్టి కులమునకు మహిళ)Thoti (ST- w) ఖాళీలు -1

దరఖాస్తులు ఈ కార్యాలయమునకు చేరవలసిన ఆఖరితేది 31-01-2019.

1 అర్హత ప్రాంతీయ భాషలో (తెలుగు)చదువుట వ్రాయుట వచ్చి ఉండవలెను
2 వయసు 1-7-2019 నాటికి కనిష్ట వయో పరిమితి 18 సంవత్సరములు, గరిష్ట వయో పరిమితి 47 సంవత్సరములు మించరాదు (పుట్టినతేది ధృవీకరణపత్రం జతపరచవలెను)
3 ప్రాంతీయత అభ్యర్ధులు గుంటూరు జిల్లా స్థానికులై ఉండవలెను దీనికి సంబందించి ఎం.ఆర్./తహసిల్దార్ ధృవీకరణ నివాస పత్రం జతపరచవలెను
4 జీతము స్కేలు రూ. 13000 – 40270
5 కుల ధృవీకరణపత్రం పై పోస్టులు ఎస్సి మరియు ఎస్టి లకు కేటాయించబడినది దానికి సంబందించిన ఎం.ఆర్./తహసిల్దార్ జారి చేసిన కుల ధృవీకరణ పత్రం సమర్పించవలెను
6 చిరునామా సరిఅయిన చిరునామా తెలియపరచకపోయినా లేక మీరు ఇచ్చిన చిరునామా కు మేము పంపిన ఉత్తరువు అందకపోయిన మా కార్యాలయముకు ఎటువంటి బాధ్యతలేదు.
7 ఎంపికచేయు విధానము అభ్యర్ధులను ఎంపికచేయు అధికారం కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నియమించిన సెలక్షన్ కమిటీ కే పూర్తి అధికారం కలదు.
8 దరఖాస్తులు స్వీకరించు తేదీలు 17 -01-2019 నుండి 31-01-2019 వరకు (కార్యాలయము పనిచేయు దినములలో ఉదయం గం. 10.30 నుండి సాయంత్రం 5.00 గం. వరకు. ఆ తరువాత వచ్చిన దరఖాస్తుఫారము స్వీకరిoపబడవు.
9 దరఖాస్తు చేయవలసిన విధానం దరఖాస్తుఫారము డౌన్లోడ్ చేసుకొని, పూర్తిచేసిన దరఖాస్తుఫారముతొ పాటుగా జతపరచవలసిన ధృవపత్రాలతో ది. 31-01-2019 లోగా గుంటూరు మెడికల్ కాలేజీ ఆఫీసునకు చేరువిధముగా పంపించవలయును. అభ్యర్ధులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలిస్తే విడివిడిగా పోస్టులు వారిగా దరఖాస్తు చేయవలెను.

 

AP Para Medical Board
GMC Alumni of North America
Directorate of Medical Education
Medical Council of India
NTR University of Health Sciences